నిమ్మకాయ (ఆకు)

ప్రస్తుతం కరోన సంక్షోభంలో కోవిడ్‌ ‌బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని డాక్టర్‌లు సలహా ఇస్తున్నారు. అందుకు సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిమ్మలో సి విటమిన్‌ ‌పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బాగా ఉపయోగ పడుతుంది. అలాగే ఋతువు మారుతున్నప్పుడు కూడా కలిగే చిన్నపాటి ఇబ్బందులను కూడా తట్టుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.
-    నిమ్మ ఆకుల రసం, లేక నిమ్మ ఆకులు వేసి తోడు పెట్టిన మజ్జిగ చాలా చలవ చేస్తుంది
-    నిమ్మకాయలో విటమిన్‌ ‌సి అధికంగా ఉంటుంది. దానివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తత్ఫలితంగా ఎన్నో క్రిమి కీటాదులు మన శరీరాన్ని బాధించకుండా ఉంటుంది
-    నిమ్మకాయ రసం, నీళ్ళు, ఉప్పు, పంచదార కలిపిన పానీయం త్రాగితే ఒక సెలైన్‌ ‌సీసా పుచ్చుకున్నంత బలం వస్తుంది.
-    నిమ్మకాయలో కెరోటిన్‌ అన్న రసాయనం వల్ల రక్తశుద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది.
-    ఎండపెట్టిన నిమ్మకాయ పొడి ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ఈ విధంగా నిమ్మకాయ చేసే మేలు అంతా-ఇంతా కాదు. కాబట్టి అందరూ నిమ్మకాయలను వృధా చేసుకోకుండా రోజూ వాడడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది.