మనదైన విద్య కావాలి (హితవచనం)


పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే, వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలి.

మన జాతి ఒక చెట్టు అయితే కాండం స్వరాజ్యం, కొమ్మలు స్వదేశీ, బహిష్కరణ విధానాలు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ విచలితం కాకుండా దృఢంగా నిలిచి, వాటిని అధిగమించాలి. ఇదే భగద్గీత మనకు అందించే సందేశం. కర్మయోగమే  భగవద్గీత.
- లోకమాన్య బాలాగంగాధర తిలక్‌