‌ప్రముఖుల మాట


ఉగ్రవాదులకు స్థావరంగా తమకు పేరు ఎందుకు వచ్చిందో పాకిస్థాన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కరోనా సంక్షోభకాలంలోనూ ఆ దేశం భారత్‌పై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోలేదు.
- మహవీర్‌ ‌సింఘ్వీ,  ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ‌రాయబారిఐకమత్యం, సేవాభావం ముఖ్యమన్న బుద్ధుడి సందేశమే అన్ని దేశాలకూ మార్గం. కోవిడ్‌ ‌సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలూ పరస్పరం సహకరించుకోవాలి. అప్పుడే ఆర్థిక, సామాజిక సమస్యలను తట్టుకుని నిలబడగలవు.
- ఆంటోనియో గ్యుటెరస్‌, ఐరాస అధినేత


చైనా యాప్‌ల నిషేధం ఒక డిజిటల్‌ ‌స్ట్రయిక్‌. ‌భారత్‌ ‌శాంతినే కోరుకుంటుంది. కానీ ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే దీటైన సమాధాన మిచ్చితీరుతుంది. ఈ విషయం ఇటీవలి సరిహద్దు ఘర్షణలో మరోసారి స్పష్టమైంది.
- రవిశంకర్‌ ‌ప్రసాద్‌, ఐటీ మంత్రి