‌ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణం

సుదీర్ఘకాలం ఎదురుచూసిన భారతీయుల కల నెరవేరింది..
ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితం కళ్ళముందు సాకారమైంది..
మహోజ్వల ఘట్టానికి అంకురార్పణ జరిగింది...
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ..

బఘువార్‌ - ఒక ఆదర్శ గ్రామం

నిజమైన భారత్‌ ‌గ్రామాలలో కనిపిస్తుందనేది ఎంత వాస్తవమో నిజమైన ఆదర్శ గ్రామాన్ని గుర్తించడమనేది కష్టం అనేది కూడా అంతే నిజం. మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రం నర్సింగపూర్‌ ‌జిల్లాలోని ఉన్న బఘువార్‌ ‌గ్రామాన్ని సందర్శిస్తే, అలాంటి ఆదర్శ గ్రామానికి ఉండే లక్షణాల్లో ఏ ఒక్కటీ తక్కువ కాని ఒక గ్రామం మనం గుర్తించవచ్చు. 

‌ప్రముఖుల మాట

శ్రీరామునిలో కనిపించే పురుషార్థం, పరాక్రమం, శౌర్యం వారసత్వంగా మనలో కూడా నిండి ఉన్నాయి. అటువంటి స్ఫురణ అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా కలుగుతున్నది. రాముడు అందరివాడు, అందరిలో ఉన్నాడు.
- డా. మోహన్‌ ‌భాగవత్‌, ‌సర్‌సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

అమరవాణి

సహసా విదధీత న క్రియా మవివేకః
పరమా పదం వృణుతే హి విమృశ్య
కారిణం గుణలుబ్ధాః
స్వయమేవ సంపదః

భావం : ఏ పనీ తొందరపడి చేయకూడదు. తొందరపాటు, అవివేకమే అన్ని ఆపదలకూ మూలం. సద్‌విమర్శ చేసి యుక్తాయుక్తాలు విచారించి పని చేసేవాడిని విజయం వరిస్తుంది.

అజేయమైన శక్తి (హితవచనం)

మునుపెన్నడూలేని విధంగా మనం శక్తిని సముపార్జించాలి. అవసరమైతే మన ప్రవృతిని మార్చుకొని సరిక్రొత్త వ్యక్తిగా రూపాంతరము చెందాలి. అపరిమితమైన శక్తిని సముపార్జించుకొన్న  వ్యక్తుల సమూహం సమాజంలో కేంద్రీకృతం కావాలి. వారి హృదయాలలో భవానీమాత శ్రోతస్సూ నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఆ జ్వాల మన మాతృ భూమి నాలుగు చెరగులా ఉన్న జనులలో రగిలించాలి. అజేయమైన శక్తి భూమండాలాన్ని మొత్తం జ్ఞానసమృద్ధం చేయగలుగుతుంది.
- యోగి శ్రీఅరవిందులు.

‌ప్రజల్ని ప్రేమించనివాడు నాయకుడు కాదు (స్ఫూర్తి)

1928లో సైమన్‌ ‌కమిషన్‌ ‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి మద్రాస్‌ ‌లో జరిగిన ప్రదర్శనలకు బారిస్టర్‌ ‌ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. అప్పటికి ఆయన వయస్సు 56ఏళ్ళు.

శ్రీ‌కృష్ణ జన్మాష్టమి

చేతవెన్నముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వగజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు

అం‌తర్గత శక్తే భారత్‌ ‌ప్రత్యేకత - సురేశ్‌ (‌భయ్యాజీ) జోషి

కరోనా సంక్షోభ సమయంలో భారతీయ సమాజపు అంతర్గత శక్తి ప్రపంచానికి వెల్లడైంది అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌కార్యవాహ సురేశ్‌ ‌భయ్యాజీ జోషి అన్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్‌ ‌మొదలైన అనేక అంశాలపై ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

సెక్యులరిజం ఒక వింత !

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశంలో పాటిస్తున్న సెక్యులర్‌ ‌విలువల్ని, రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ కొందరు విమర్శలు చేశారు. దీనితో ‘సెక్యులరిజం గురించిన చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.

‌ప్రజల కోసం శివారు గ్రామంలో వెదురు వంతెన నిర్మించిన సేవాభారతి కార్యకర్తలు

గ్రామస్థుల సమస్యను తీర్చేందుకు సేవాభారతి కార్యకర్తలు వంతెన నిర్మించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని అరప్పుజలం పంచాయితీలో మూలమట్టం అనే గ్రామం ఉంది. ఇక్కడి గ్రామస్తులు ప్రతి ఏడాది విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నారు. 

రామభక్తే రాంరావ్‌ను నడిపింది

మానవ సంకల్పం గట్టిదైతే భగవంతుని సహకారం కూడా లభిస్తుందనడానికి మంచి ఉదాహరణ అయోధ్య రామజన్మభూమిలో శ్రీ రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడం. 500 సంవత్సరాలుగా హిందువులు సాగించిన పోరాటం చివరికి ఫలించింది. 

రామజన్మభూమి ఆలయం కోసం 28 ఏళ్ళు ఉపవాసం

రామజన్మభూమిలో ఆలయం కోసం ఓ మహిళ 28ఏండ్ల పాటు ఉపవాసం చేసింది. జబల్‌పూర్‌కు చెందిన 81ఏళ్ల ఊర్మిలా చతుర్వేది రామమందిరం నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ ఉపవాసం ఉంటానని 28ఏండ్ల క్రితం శపథం చేసింది. ఆగస్టు 5 రామమందిర భూమిపూజ జరుగడంతో 28 ఏండ్ల ఆమె కల నెరవేరింది. ఈ 28 ఏండ్లు ఆమె పండ్లు, ఫలాలను మాత్రమే తింటూ జీవనం సాగించింది..

స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు మహిళలు

బ్రిటీష్‌ ‌రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎందరో తెలుగు మహిళలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. బ్రిటీష్‌ ‌పాలకులకు దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు. అలాంటివారిలో మాగంటి అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ గాంధీజీ ప్రశంసలు పొందిన వనితలు.

విఘ్నేశ్వరుడి పూజ పత్రాలు

విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు - వాటి ఔషధ గుణాలు
మాచిపత్రి: ఇది కుష్టు వాతరక్తం జ్వరాన్ని  తగ్గిస్తుంది.
వాకుడు: కఫం, వాతం,శూలజ్వరం, వాంతులు, గుండెజబ్బు, ఆకలి లేకపోవటం వంటివాటిని నివారిస్తుంది.

దేవస్థానం పాఠశాలల్లో అరబిక్‌ ఉపాధ్యాయులు!

 
దక్షిణ కేరళలో దేవాలయ నిర్వహణకు చేసే ట్రావెన్కోర్‌ ‌దేవస్వం బోర్డ్ ‌తమకు చెందిన పాఠశాలల్లో అరబిక్‌ ఉపాధ్యాయులను నియమించనుంది ఈ మేరకు బోర్డు ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.

రాజ్యాంగం నుండి ‘సోషలిస్ట్’, ‘‌సెక్యులర్‌’ ‌పదాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు

రాజ్యాంగ పీఠిక నుంచిసోషలిస్ట్, ‘‌సెక్యులర్పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రెండు పదాలు 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారనీ, వీటిని తొలగించాలని న్యాయవాదులు బలరాం సింగ్‌, ‌కరుణేశ్‌ ‌కుమార్‌ ‌శుక్ల, విష్ణు శంకర్‌ ‌జైన్‌ ‌సుప్రీం కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు.