దేవస్థానం పాఠశాలల్లో అరబిక్‌ ఉపాధ్యాయులు!

 
దక్షిణ కేరళలో దేవాలయ నిర్వహణకు చేసే ట్రావెన్కోర్‌ ‌దేవస్వం బోర్డ్ ‌తమకు చెందిన పాఠశాలల్లో అరబిక్‌ ఉపాధ్యాయులను నియమించనుంది ఈ మేరకు బోర్డు ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.

అరబిక్‌ ‌తో పాటు గణితం సంగీతం సాంఘిక శాస్త్రం, హిందీ వంటి సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయుల ఖాళీలను బోర్డు భర్తీ చేసింది. అయితే ఇందులో సంస్కృత ఉపాధ్యాయులను నియమించక పోవడం గమనార్హం.
ట్రావెన్కోర్‌ ‌దేవస్థానం బోర్డు 1950లో ట్రావెన్కోర్‌ ‌కొచ్చిన్‌ ‌హిందూ మత సంస్థలలోని చట్టం(15) ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. కేరళలోని ట్రావెన్కోర్‌ల పరిపాలనా సమయంలో అప్పుడు ఉన్న 1248 దేవాలయాల నిర్వహణ బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. 1949 వరకు ఈ దేవాలయాలన్నీ ట్రావెన్కోర్‌ ‌పరిపాలిస్తున్న రాచరిక రాజుల అధీనంలో ఉండేవి.
ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్టం లోని 5 దేవస్వమ్‌ ‌బోర్డులపై పెత్తనం చెలాయిస్తూ, దేవాలయాల నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను హిందువులకు అందకుండా ప్రయత్నాలు చేస్తోంది.