‌ప్రముఖుల మాట

శ్రీరామునిలో కనిపించే పురుషార్థం, పరాక్రమం, శౌర్యం వారసత్వంగా మనలో కూడా నిండి ఉన్నాయి. అటువంటి స్ఫురణ అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా కలుగుతున్నది. రాముడు అందరివాడు, అందరిలో ఉన్నాడు.
- డా. మోహన్‌ ‌భాగవత్‌, ‌సర్‌సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌
 

అయోధ్యలో మందిర నిర్మాణ భూమిపూజకు ప్రధాని హాజరైతే సెక్యులరిజం మంటగలిసిపోయిందని, రాజ్యాంగవిలువలు నాశనమై పోయాయని కొందరు గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతి ఏడాదీ రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఇచ్చే ఇఫ్తార్‌ ‌విందుల సంగతేమిటి?
- తేజస్వీ సూర్య, పార్లమెంట్‌ ‌సభ్యడు
 

కరోనా వైరస్‌ ‌మమ్మల్ని తాకినప్పటి నుంచి చైనాపట్ల మా వైఖరిలో మార్పు వచ్చింది. వైరస్‌ ‌గురించి బయటకు తెలియకుండా దాచినందుకు ఆ దేశం బాధ్యతవహించాలి. కోవిడ్‌19 ‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది.
- డొనాల్డ్ ‌ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు