అం‌తర్గత శక్తే భారత్‌ ‌ప్రత్యేకత - సురేశ్‌ (‌భయ్యాజీ) జోషి

కరోనా సంక్షోభ సమయంలో భారతీయ సమాజపు అంతర్గత శక్తి ప్రపంచానికి వెల్లడైంది అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌కార్యవాహ సురేశ్‌ ‌భయ్యాజీ జోషి అన్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్‌ ‌మొదలైన అనేక అంశాలపై ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ప్ర. కరోన మహమ్మారిపై పోరులో ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ సమాజం కూడా మహమ్మారిని ఎదుర్కోవడంలో అపూర్వమైన పద్దతిలో స్పందించింది. ఈ మొత్తం పరిస్థితులను మీరు ఎలా చూస్తారు?

జ. ప్రస్తుత తరం ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అయితే సమాజానికి ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు సంఘ స్వయంసేవకులు సహాయకార్యక్రమాలు చేపట్టడమేకాక తమదైన పద్దతిలో పరిష్కారం కనుగొనడం చూస్తాం. కరోన మహమ్మారి సమయంలో కూడా వాళ్ళు అలాగే చేశారు.

దేశమంతటా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించినప్పుడు రోజు కూలీ చేసుకుని జీవనం సాగించేవారికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. ఇది గమనించిన స్వయంసేవకులు వెంటనే వారికి రేషన్‌, ఆహార పదార్ధాలు అందించే ఏర్పాటు చేశారు. అయితే పని లేకపోవడంతో ఈ కార్మికులకు సంపాదన లేక ఆహారపదార్ధాలు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనితో అలాంటివారికి నెలకు పైగా రేషన్‌ అం‌దించే వ్యవస్థ చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఈ పని జరిగింది. ఇందులో 2 లక్షలకు పైగా స్వయంసేవకులు పాలుపంచుకున్నారు. కోటికి పైగా కుటుంబాలకు ఇలాంటి సహాయాన్ని వాళ్ళు అందించారు.

ప్ర. సంఘ స్వయంసేవకులు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమవడానికి వారికి ప్రేరణ ఎక్కడ నుండి కలుగుతుంది?

జ. విపత్తు నిర్వహణలో మేమేమీ నిపుణులం కాదు. అలాగే కార్యకర్తలకు అలాంటి శిక్షణ ఏది ఇవ్వం కూడా. కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన సంఘ స్వయంసేవకుల్లో సహజంగానే కలుగుతుంది. ఆ రకమైన సంస్కృతి ఇక్కడ ఉంది. దశాబ్దాలుగా స్వయంసేవకులు అనేక విపత్తుల సమయంలో సహాయకార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అందుకు మేము ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. కనీసం ఆ సహాయకార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన సాధనసంపత్తి కూడా అందించలేదు. అయినా స్వయంసేవకులే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేపట్టడమేకాక అందుకు అవసరమైన సాధనాలు కూడా సమకూర్చుకున్నారు.

ప్ర. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి సంఘ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ సంస్థలు అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల విషయంలో ఆర్‌ ఎస్‌ ఎస్‌ అభిప్రాయం ఏమిటి?

జ. ఆర్ధిక సంక్షోభం అనేక రకాలు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయాలి. ఇలాంటి వారికి వెంటనే ఉపాధి చూపే ఏర్పాటు చేయాలి. యజమానులు కూడా ఈ కార్మికుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. అయితే స్వస్థలాలకు వెళ్ళిపోయిన వారిలో చాలామంది అక్కడే ఉపాధి చూసుకోవా లనుకుంటున్నారు. అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాయి.

ప్రజల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా దృష్టి సారించాలి. స్థానిక అవసరాలకు తగిన వృత్తి నిపుణులను స్థానికంగానే తయారుచేసుకుంటే అప్పుడు ఇతర ప్రాంతాల నుంచి తరలించాల్సిన అగత్యం ఉండదు. కాబట్టి ఈ సంక్షోభ సమయంలో ఏర్పడిన పరిస్థితులను అవకాశంగా తీసుకుని అందుకు తగిన చర్యలు చేపట్టాలి.

ప్ర. ‘ఆత్మనిర్భర భారత్‌ ‌సాధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు వివిధ సంస్థలు మద్దతునిచ్చాయి. నేటి వైశ్వీకరణ యుగంలో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడు తున్నాయి. ఇలాంటప్పుడు ‘ఆత్మనిర్భరత ఎలా సాధించగలం?

జ. మన గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే అనేక స్థానిక ఉత్పత్తులు తయారవుతున్నాయి. ప్రధాని ‘స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనివ్వండి(Be Vocal about Local) అంటూ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇలా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఒక ప్రాంతంలోని అవసరాలన్నీ అక్కడే తీరేవిధంగా ఎలాంటి చర్యలు చేపట్ట వచ్చన్నది పరిశీలించాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు తయారుచేసే వస్తువులన్నింటిని స్థానికంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాకపోవచ్చును. కానీ చిన్నతరహా వ్యాపారాలను తప్పక ప్రోత్సహించాలి.

ప్రతి జిల్లాను కేంద్రంగా చేసుకుని అలాంటి వ్యాపారాలను అభివృద్ధి చేయాలి. పెద్ద వ్యాపారా లకు రాష్ట్రాన్ని కేంద్ర స్థానంగా పరిగణించవచ్చును. ఇలా జిల్లాలను కేంద్రంగా స్థానిక వ్యాపారాలను అభివృద్ధి చేస్తే స్వావలంబన, ‘ఆత్మనిర్భరత సాధించగలుగుతాం. చైనా, భారత్‌ ‌సరిహద్దు వివాదం మూలంగా దేశంలో ‘స్వదేశీ భావన, ఆలోచన పెరిగాయి. కోట్లాది ప్రజానీకం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తూ వాటినే కొనుగోలు చేయడం ప్రారంభిస్తే అప్పుడు ‘ఆత్మనిర్భరత సులభంగా సాధించగ లుగుతాం. స్వావలంబన సాధించడానికి అనువైన పరిస్థితులు కల్పించగలిగితే ‘ఆత్మనిర్భరత కేవలం నినాదంగా మిగిలిపోకుండా ఆచరణలో సాధ్యపడుతుంది.