విఘ్నేశ్వరుడి పూజ పత్రాలు

విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు - వాటి ఔషధ గుణాలు
మాచిపత్రి: ఇది కుష్టు వాతరక్తం జ్వరాన్ని  తగ్గిస్తుంది.
వాకుడు: కఫం, వాతం,శూలజ్వరం, వాంతులు, గుండెజబ్బు, ఆకలి లేకపోవటం వంటివాటిని నివారిస్తుంది.

మారేడు: వాతాన్ని తగ్గిస్తుంది. దీని పండు శూల జ్వరాన్ని తగ్గిస్తుంది.
గరిక: ఇది రక్తపైత్యం, కఫం,దప్పిక, విసర్పి రోగాలను నయం చేస్తుంది.
ఉమ్మెత్త: కుష్టువు దురద, కురుపులు, అరికాలిబొబ్బలు మొదలైనవాటిని తగ్గిస్తుంది.
రేగు: ఇది పిత్తాన్ని వాతాన్ని హరిస్తుంది. ఆకలి బాగుగా కలుగచేస్తుంది.
తులసి:  హృదయానికి బలాన్ని కలిగిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. శ్లేష్మం, దగ్గు, వాంతులు తగ్గిస్తుంది.
దానిమ్మ: చలువచేస్తుం•ది.గుండెకి బలం ఇస్తుంది.  ఆకలి పుట్టిస్తుంది. భోజనం తరువాత తింటే అన్నం బాగా జీర్ణమవుతుంది. వాతం, కఫం, పైత్యాన్ని హరించి రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
మరువం: దీని కషాయం పైత్యం, శ్లేష్మం,  క్షయరోగం తగ్గిస్తుంది.  ఆకలి పుట్టిస్తుంది. జీర్ణశక్తిని వృద్దిచేసి ఇంద్రియపుష్టినిస్తుంది.
వావిలి: ఇది గుల్మరోగం అరుచి సన్నిపాత జ్వరం మొదలైనవాటిని నశింపచేస్తుంది.
శీతాఫలం: ఇది శరీరముకు చలువచేస్తుంది.  రక్తాన్ని వృద్దిచేస్తుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
వెలగ: ఇది కఫాన్ని నశింపచేస్తుంది. దీని ఫలం మధురంగా పుల్లగా ఉంటుంది. అరుచి, దప్పికను తగ్గిస్తుంది. కంఠశుద్ధి కలుగచేస్తుంది. నిద్ర కలుగచేస్తుంది. తలనొప్పి తగ్గిస్తుంది.