చైనాకి దీటుగా బదులిచ్చిన భారత్‌

58 ఏళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా భారత్‌ ‌తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. 1962 యుద్ధం తరువాత లఢఖ్‌ ‌ప్రాంతంలోని ఫింగర్‌ 4 ‌తో సహా మరో నాలుగు ప్రదేశాలను భారత్‌ ‌తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రక్షణ రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతమైన ఫుర్చుఖ్‌లోకి చొచ్చుకు పోయిన భారత్‌ ‌దళాలు అక్కడి స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి.

కరోనా బాధితులకు అండగా నిలచిన మహిళలు


కరోనా వైరస్‌ ఒక ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కూడా ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ‌సమయంలో నానా అవస్థలు పడ్డారు. మరీ ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఏం చేయాలో తోచక చాలామంది స్త్రీలు మానసికంగా కుంగిపోయారు. "సేవా భారతి మహిళా విభాగం’’ ముందుకు వచ్చి నిస్సహాయులైన ఇలాంటి మహిళలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు, వారికి నిత్యావసర సరుకులు, పీపీఈ కిట్లు అందించడం, కోవిడ్‌19 ‌రోగులకు హెల్ప్ ‌లైన్‌ ‌ద్వారా పరిష్కారం చూపడం వంటి అవిశ్రాంత సేవా కార్యక్రమాలు నిర్వహించింది.

‌ప్రముఖుల మాట

1962 తరువాత భారత-చైనాల మధ్య ఇప్పుడే ఇంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించడమే మార్గమని చైనాకు చెప్పాం.
- జైశంకర్‌, ‌భారత విదేశాంగ మంత్రి

అమరవాణి


షట్‌ ‌దోషో పురుషే నేహ
హాతవ్యా భూతి మిచ్ఛతా
నిద్రా తంద్రా భయం క్రోధం
ఆలస్యం దీర్ఖసూత్రతా
భావం : బాగుపడదలచిన మానవుడు అతినిద్ర, బద్ధకం, భయం, కోపం, పని పూర్తిచేయకుండా నాన్చడం అనే ఆరు దోషాలను విడిచిపెట్టాలి.

జాతీయ కార్మిక దినోత్సవంసెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి  
విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సహజ జీవనానికి సంబంధించిన వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తన అసామాన్య ప్రతిభతో అనేక రకాల పరికరాలను, యంత్రాలను రూపొందించాడు. విశ్వకర్మ తమ పూర్వీకుడు అయినందుకు  భారతీయు లంతా గర్వించాలి. విశ్వకర్మ రూపొందించిన పనిముట్లతో స్వీయ నిర్వహణతో సాగిన వృత్తులతో కూడిన ఆర్థిక వ్యవస్థ విలసిల్లింది. ప్రతి కుటుంబం తమదైన వృత్తి పరిశ్రమను నిర్వహించేది. వ్యవస్థీకృతమైన కుటుంబ పరిశ్రమల పరంపర విశ్వకర్మ నుంచే మొదలయ్యింది.

నిస్వార్ధ సేవలోనే భగవంతుడున్నాడు (స్ఫూర్తి)

ఒకసారి స్వామి వివేకానంద దగ్గరకు ఒక భక్తుడు వచ్చి ‘స్వామీజీ, భగవంతుని దర్శనం కోసం నేను నిత్యం ధ్యానం చేస్తున్నాను. నా గది కిటికీలు, తలుపులు వేసుకుని ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నాను. నాకు ఎప్పటికీ దైవదర్శనం అవుతుంది’ అని అడిగాడు. అందుకు స్వామి వివేకానంద ‘దేవుడిని చూడాలనుకుంటే కేవలం ధ్యానం మాత్రమే సరిపోదు. బయటకు వచ్చి మొక్కలను, పూసిన పూలను, కాచిన పండ్లను చూడు. వాటిలో దేవుడు కనిపిస్తాడు. పక్షుల పాటలు విను. అక్కడా దేవుడున్నాడు.

‌స్వేచ్ఛ (హితవచనం)

ప్రపంచ చరిత్రలో, హిందూ ధర్మం మాత్రమే మానవ మనస్సుకి సంపూర్ణ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది, దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. హిందూ ధర్మం అంటే స్వేచ్ఛ, ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ. 

రామమందిర నిర్మాణం ఎందుకు?

ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్‌లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల భారతీయుల విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేవు.

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే జాతీయ విద్యా విధానం

అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొని వచ్చింది.

నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం


ఆదిలాబాద్‌: ‌భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ ‌మాననీయ శ్రీ దేవందర్‌ ‌జీ, శ్రీ దుర్గారెడ్డి గారు వివిధ సామాజిక, స్వచ్ఛంధ సంఘాల పెద్దలు మరియు సంఘ్‌ ‌కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‌ప్రకృతి వందన

పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి జీవించాలనే ధోరణిలో ఉంది ఆ శైలి. ప్రకృతి మనిషి వాడుకునేందుకే ఉన్నదని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనిషికి లేదనే ధోరణి అది. 

నిబంధనలు అతిక్రమించిన క్రైస్తవ సంస్థల విదేశీ విరాళాల సేకరణ లైసెన్సులు రద్దు

చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఆరు స్వచ్ఛందం సంస్థలపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ విరాళాల సేకరణ (సవరణ) చట్టం ప్రకారం ఆ సంస్థలకున్న లైసెన్సులు రద్దు చేసింది. వీటిలో నాలుగు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనార్హం. అంతే కాకుండా అమెరికా నుండి విరాళాలు పొందుతున్న మరో రెండు సంస్థలపై నిఘా ఉంచినట్టు కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిని పత్రికలకు చెప్పినదాని ప్రకారం లైసెన్సులు రద్దైన క్రైస్తవ సంస్థల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కరోనాకు కళ్లెం వేసేందుకే...

కరోనా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే... చైనాలోని వూహాన్‌ ‌నగరంలో ఊపిరి పోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వైరస్‌ ‌బ్రిటన్‌ ‌పీడకలలా పరిణమించింది. ఇప్పటికే ఎందరోమంది ఈవ్యాధి బారిన పడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరెందరో మంది  మరణించారు. 

మలేరియా జ్వరానికి తులసి చికిత్స


మలేరియా జ్వరం వర్షాకాలంలో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి ఇతర వైద్యులు క్వినైన్‌ ‌మందుగా వాడటం జరుగుతుంది. దీనివల్ల జ్వరం తగ్గుతుందికానీ తలనొప్పి, వికారం, చెవుడుతో సహా  హృదయసంబంధ సమస్యలవంటివి మిగిలిపోతాయి. తులసి ద్వారా ఎటువంటి కొత్త సమస్యలు రాకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు.

5000 ‌మంది ఎస్సీలకు విహెచ్‌పి అర్చక శిక్షణ పూర్తి


సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా  విశ్వహిందూ పరిషత్‌  ఒక మహత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందినవారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్‌ ‌జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ ‌బన్సల్‌ ‌ప్రకటన విడుదల చేశారు.