రామమందిర నిర్మాణం ఎందుకు?

ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్‌లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల భారతీయుల విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేవు.

కోట్లాదిమంది భారతీయుల విశ్వాసాలు, ఆశయ ఆకాంక్షలకు గుర్తుగా భవ్య రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5‌న భూమిపూజ జరిగింది. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఈ సంఘటన సువర్ణధ్యాయంగా నిలిచిపోతుంది. 1951లో సౌరాష్ట్ర(గుజరాత్‌)‌లోని సుప్రసిద్ధ సోమనాధ మందిర ప్రారంభోత్సవాన్ని నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ‌చేశారు. సోమనాధ మందిర పునర్నిర్మాణం సనాతన భారతీయ చింతన, అస్తిత్వాలకు ప్రతీక అని సర్దార్‌ ‌పటేల్‌, ‌కె.ఎం. మున్షీ, మహాత్మా గాంధీ, వి.పి. మీనన్‌, ‌డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌వంటి మహామహులంతా భావించారు.
కానీ నెహ్రూ వంటి వారు మాత్రం ఇది ‘హిందుత్వవాదపు పునర్‌ ‌స్థాపన’ (ఱఅ•బ తీవఙఱఙ•శ్రీఱఎ) అంటూ వ్యతిరేకించారు. ఆ సందర్భంగా నెహ్రూతో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, వాదోపవాదాలను కన్హయ్యలాల్‌ ‌మున్షీ తన ఃజూఱశ్రీస్త్రతీఱఎ•స్త్రవ •శీ ఖీతీవవ•శీఎః అనే పుస్తకంలో పేర్కొన్నారు.
అవి చదివితే ఇప్పుడు రామమందిర నిర్మాణానికి భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అర్ధమవుతుంది. దానిని వ్యతిరేకిస్తున్నవారి ధోరణి కూడా అవగతమవు తుంది.
ఎందుకంటే సోమనాధ మందిరంపైన అనేకసార్లు దాడి చేసిన ముస్లిం దురాక్రమణదారుడైన గజనీ చివరికి దానిని ధ్వంసం చేశాడు. ఆ మందిర పునర్నిర్మాణ సమయంలో కూడా ఇప్పటిమాదిరిగానే భారతీయ సాంస్కృతిక చరిత్రను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా రాజకీయాలు ఎలా సాగాయో తెలుస్తుంది.
విశ్వాసాలపై దాడి
దురాక్రమణదారులు కేవలం ఒక దేశంపై దాడి చేసి భూభాగాన్ని మాత్రమే ఆక్రమించరు. ఆ దేశ సంస్కృతి, విశ్వాసాలను కూడా దెబ్బతీయడం ద్వారా అక్కడి ప్రజానీకాన్ని అవమానానికి గురిచేస్తారు. అయోధ్యలో మసీదుగా చెపుతున్నది అసలు మసీదేనా? అది ప్రార్ధనలు చేసుకునేందుకే కట్టరా? అంటే లేదు. బాబర్‌ ఆదేశాల మేరకు అయోధ్యాపై దాడిచేసిన సేనాధిపతి మీర్‌ ‌బాకీ అక్కడ నమాజు చేసుకోవాలని నిజంగా అనుకుని ఉంటే అక్కడ ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో ఎక్కడైనా పెద్ద మసీదు కట్టించుకుని ఉండవచ్చును. పైగా బలవంతంగా ఆక్రమించుకున్న స్థలం లేదా భవనంలో చేసే నమాజును అల్లా అంగీకరించడని ముస్లిం మతపెద్దలు సుప్రీం కోర్ట్ ‌లోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. కాబట్టి రామమందిరాన్ని ధ్వంసం చేసి మీర్‌ ‌బాకీ అక్కడ కట్టడాన్ని నిర్మించడానికి కారణం నమాజు కోసం కానేకాదు. అలాగే ఆ కట్టడానికి ఇస్లాం సూత్రాల ప్రకారం ఎలాంటి గుర్తింపు ఉండదు కూడా. అయినా ఆ కట్టడం ఎందుకు కట్టాడు? ఎందుకంటే భారతీయ విశ్వాసాలు, అస్తిత్వం, గౌరవాలను దెబ్బకొట్టడం అతని లక్ష్యం.
కె. ఎం. మున్షీ ఇలా వ్రాసారు
‘‘1922లో నేను ఆ ధ్వంసమైన మందిరాన్ని చూడటానికి వెళ్ళాను....అపవిత్రమై, శిధిలమైన స్థితిలో కూడా ఆ మందిరం దృఢంగా నిలచి ఉంది. జరిగిన అవమానాన్ని మరచిపోరాదని చెపుతున్నట్లుగా ఉంది... కూలిన స్తంభాలు, చెల్లాచెదురుగా పడిఉన్న రాళ్ళను చూసినప్పుడు నాలో అవమాన జ్వాలలు ఎంతలా ఉవ్వెత్తున లేచాయో చెప్పలేను.’’
 సాంస్కృతిక వారసత్వం, సంపద అంటే కేవలం కట్టడాలు, భవనాలు మాత్రమే కాదు. సమాజాన్ని ఒకటిగా ఉంచే విలువలు, సంప్రదాయాలు, ఆచారాలు కూడా. అవి సమాజానికి శక్తిని, ప్రేరణను కలిగిస్తాయి.  
కె.ఎం. మున్షీ ఇలా వ్రాసారు
కేబినెట్‌ ‌సమావేశం ముగిసిన తరువాత జవహర్‌ ‌లాల్‌ ‌నన్ను పిలిచి ఇలా అన్నారు -‘‘సోమనాధ పునర్నిర్మాణం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇది హిందుత్వవాదపు పునర్‌ ‌స్థాపనమే (ఱఅ•బ తీవఙఱఙ•శ్రీఱఎ). ఇంటికి వెళ్ళిన తరువాత ఈ విషయంలో వివరంగా సమాధానం ఇస్తానని నేను ఆయనకు సమాధానమిచ్చాను.’’
కె.ఎం. మున్షీ ఇలా వ్రాసారు
‘‘నిన్న మీరు ‘హిందుత్వవాద పునర్‌ ‌స్థాపన’ (ఱఅ•బ తీవఙఱఙ•శ్రీఱఎ) గురించి అన్నారు. మీ ఆలోచనలు ఏమిటో నాకు తెలుసు. నేను వాటిని గౌరవిస్తాను. .... గతం పట్ల నాకు ఉన్న విశ్వాసమే వర్తమానంలో నేను పనిచేసేందుకు శక్తిని ఇస్తుంది. భగవద్గీతను నా నుంచి దూరం చేసే ‘స్వేచ్చ’ వల్ల ఉపయోగం లేదు. అలాగే లక్షలాది మంది ప్రజానీకాన్ని వారి విశ్వాసం నుంచి, దేవాలయాల నుంచి దూరం చేస్తే అది మన జీవన వ్యవస్థనే నాశనం చేస్తుంది.’’
‘‘...సోమనాధ మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్‌ (అప్పటి రాష్ట్రపతి)ని ఆ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించాను. అలాగే నా ఆహ్వానం స్వీకరించినట్లైతే ఆ తరువాత ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేసుకోకుండా కార్యక్రమానికి రావాలని కూడా ఆయనతో అన్నారు.
నా అనుమానం నిజమయింది. సోమనాధ మందిర ప్రారంభోత్సవానికి రాజేంద్ర ప్రసాద్‌ ‌హాజరవుతారని ప్రకటించగానే నెహ్రూ అందుకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాజేంద్ర ప్రసాద్‌ ఆ ‌కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆ మర్నాడు వార్తా పత్రికలన్నీ ప్రచురించాయి. కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రభుత్వ విభాగం మాత్రం పట్టించుకోలేదు. అధికారికంగా ఎక్కడా రికార్డ్ ‌చేయలేదు, నమోదు చేయలేదు.’’
నెహ్రూతో సహా మరికొంతమంది కూడా సోమనాధ పునర్నిర్మానాన్ని వ్యతిరేకించినా గాంధీజీతోపాటు అనేకమంది జాతీయనాయకులు ఆ కార్యాన్ని పూర్తిగా సమర్ధించారన్నది నిజం. వారి కృషి మూలంగానే మందిర నిర్మాణం పూర్తైంది, లక్షలాదిమంది భక్తులు సోమనాధుని దర్శనం చేసుకుంటున్నారు.
60 ఏళ్లపాటు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండడం, ఈ హిందూ వ్యతిరేక ధోరణిని ప్రభుత్వం పూర్తిగా సమర్ధించడం, మద్దతునివ్వడంతో విద్య, పరిశోధన సంస్థల్లో, మీడియాలో ఈ వైఖరే స్థిరపడింది. అందుకనే రామమందిర నిర్మాణం విషయంలో మీడియాలో, మేధావులలో వ్యక్తమైన వ్యతిరేకత ఎక్కువ బలంగా ఉన్నట్లు కనిపించింది.
క్లుప్తంగా చెప్పాలంటే అయోధ్యలో రామమందిరం కేవలం మరో దేవాలయం కాదు. అది కోట్లాదిమంది భారతీయుల సనాతన విశ్వాసం, గౌరవాలకు ప్రతీక. అందువల్ల ఆ మందిర పునర్నిర్మాణం భారతదేశ సాంస్కృతిక గౌరవ పునర్‌ ‌స్థాపనే అవుతుంది.
ఈ సాంస్కృతిక గౌరవ పునర్‌ ‌స్థాపన కార్యం 2020 ఆగస్ట్ 5‌న ప్రారంభమైంది.
 

- డా. మన్మోహన్‌ ‌వైద్య , ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహ సర్‌కార్యవాహ