‌ప్రముఖుల మాట

1962 తరువాత భారత-చైనాల మధ్య ఇప్పుడే ఇంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించడమే మార్గమని చైనాకు చెప్పాం.
- జైశంకర్‌, ‌భారత విదేశాంగ మంత్రి

 

వలస వచ్చిన హిందువులు ఏ దేశంలోనూ హింసకు పాల్పడటంలేదు. ఎప్పుడూ తీవ్రవాదులుగా మారలేదు. పైగా వాళ్ళు అనేక దేశాల్లో వివక్షకు గురయ్యారు. అయినా ప్రపంచ మీడియా హిందువులను కించవరుస్తూనే ఉంది. ఎందుకని?
- డేవిడ్‌ ‌ఫ్రాలీ, పద్మభూషణ్‌ ‌పురస్కార గ్రహీత


అమీర్‌ ‌ఖాన్‌ ‌వంటివారు తమ సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు. అయినా హిందూ దేవీదేవతలను కించపరస్తూ సినిమాలు తీస్తున్నారు. వీళ్ళు పాకిస్థాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌లేదా ఏదైనా ముస్లిం దేశంలో ఇస్లాం గురించి సినిమా తీయగలరా? వీరిని ఇంతగా సహిస్తున్న భారత్‌లో మాత్రం ‘అసహిష్ణుత’ పెరిగిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
- తస్లీమా నస్రీన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌రచయితి