బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదు : సిబిఐ ప్రత్యేక కోర్టు

బాబ్రీ కట్టడపు కూల్చివేతకేసులో ఉత్తరప్రదేశ్‌ ‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పువెల్లడించింది. కేసులో నిందితులుగా ఉన్నమురళీమనోహర్‌ ‌జోషి, ఎల్‌ ‌కె అద్వానీ, ఉమాభారతి, రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్యగోపాల్‌ ‌దాస్‌, ‌ట్రస్ట్ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌లతో పాటు మొత్తంగా 32 మందిని కోర్టునిర్దోషులుగాప్రకటించింది.

పాడి రైతులకు ఆర్ధిక చేయూత..

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు 

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ఒక వినూత్ నకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశ వ్యాప్తంగా విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. పథకానికిగోమయదియాగా పేరు పెట్టింది.

ప్రముఖుల మాట

 

దేశ ప్రజలంతా క్రమశిక్షణతో, సమిష్టిగా కరోనా మహమ్మారిని అంతం చేయాలి. మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీసమైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. కలసి పోరాడితే విజయం మనదే.

- రామ్‌ ‌నాధ్‌ ‌కోవింద్‌, ‌రాష్ట్రపతి

అమరవాణి


ఆరోగ్యం విద్వత్తా సజ్జనమైత్రీ మహాకులే జన్మ
స్వాధినతా చ పుసాం మహాదైశ్వర్యం వినా ప్యర్ధేః

భావం : ఆరోగ్యం, విద్వత్తు, సజ్జనుల స్నేహం, శ్రేష్ఠమైన వంశమందు జన్మ, ఇతరుల అధీనమందు లేకుండుట - ఇవి అన్నియూ ఐశ్వర్యము లేకుండావచ్చు మహైశ్వర్యములు.

సంతోషంగా జరుపుకొనే పండగ విజయ దశమి

 

విజయదశమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అంటారు. నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి, చివరి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు.

అభిమానం (స్ఫూర్తి)


లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి ప్రధాని అయ్యే సమయానికి ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ తరువాత అతనికి సీనియర్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌గా ప్రమోషన్‌ ‌వచ్చింది. అదే విషయం ఆయన తన తండ్రి అయిన లాల్‌ ‌బహదూర్‌కు చెప్పారు.

అశాంతి, అలజడికి కారణం (హితవచనం)

కష్టించి పనిచేయకుండా సమకూర్చుకొన్న సంపద, ఆత్మ తృప్తిలేని భౌతిక సుఖము, శీలము లేకుండా నేర్చుకొన్న విద్య, దర్మబద్దము కాని వ్యాపారము, మానవత్వమును విస్మరించిన విజ్ఞాన శాస్త్రము, సమర్పణాభావం లోపించిన ఆరాధన, నైతిక విలువలు లోపించిన రాజీయాల వలన సమాజములో హింస ప్రేరేపింపబడుతోంది.
- మహాత్మాగాంధీ

నిరుపేదలకు అండగా సేవాభారతి వడ్డీ లేని రుణం


 కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.

వైద్యుల సేవలు అభినందనీయం : శ్రీ భాగయ్య


కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ వ్యాప్తంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సహ సర్‌ ‌కార్యవాహ శ్రీ భాగయ్య గారు అన్నారు.  ఆదివారం సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ లోని ప్రముఖ డాక్టర్లు, వాలంటీర్లతో నిర్వహించిన వెబినార్‌ ‌సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్‌ ‌ద్వారా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించి నందుకు డాక్టర్లను, వారికి సహకరించిన కుటుంబ సభ్యులను సందర్భంగా మనస్ఫూర్తిగా అభినంది స్తున్నట్టు తెలిపారు.  

కార్యశీలి, దార్శనికుడు దత్తోపంత్‌ ‌జీ

దత్తోపంత్‌ ‌ఠేంగ్డేజీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్ను స్థాపించిన కాలానికి ప్రపంచమంతటా కమ్యూనిజం ప్రభావం బాగా ఉంది. అలాంటి సమయంలో నూటికినూరుపాళ్లు భారతీయ చింతన ఆధారంగా కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించడం, అనేక అవరోధాలను ఎదుర్కొంటూ దానిని బలోపేతం చేయడం చాలా కఠినమైన, కష్టమైన పని. అచంచలమైన విశ్వాసం, అకుంఠితమైన శ్రద్ధ, అలుపెరుగని పరిశ్రమ లేకపోతే కార్యం సాధ్యపడేది కాదు. సమయంలో వారి ఆలోచనలు, మనస్థితి ఎలా ఉండేవో తెలియ జేసేందుకు తగిన ఒక కధ గుర్తుకు వస్తోంది-

వ్యవసాయ సంస్కరణలు.... రైతుల జీవితాల్లో వెలుగు రేఖలు...!

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ కేంద్రం ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛ రైతులకు లభించింది. దీంతో పాటు అనేక రకాలుగా రైతులకు సంస్కరణలు ప్రయోజనం కలిగిస్తున్నాయి.

ఉత్తమ ఎన్జీవోగా ఎంపికైన రాష్ట్రీయ సేవాభారతి

కరొనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్రీయ సేవా భారతి ఉత్తమ ఎన్‌.‌జి.ఓగా ఎంపికయింది.

బంజరును ‘బంగారం’గా మార్చే అమృత్‌ ‌మిట్టి

 

బంజరు భూమిని బంగారంగా మార్చే పక్రియను కనిపెట్టింది ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌కు చెందిన అల్కా లహొటి. బిజ్నూర్కు చెందిన అల్కాకు  నాగినా గ్రామంలో పెద్ద గోశాల ఉంది. అక్కడి గోవుల మూత్రం, పేడ ఉపయోగించి భూమిని సారవంతం చేసే ప్రత్యేకమైనఅమృత్‌ ‌మిట్టిని తయారుచేసింది అల్కా. అమృత్‌ ‌మిట్టి నిస్సారమైన నేలను కూడా సారవంతంగా తయారు చేస్తుందని ఆమె అంటోంది.

థైరాయిడ్‌ ‌సమస్య


  థైరాయిడ్‌ ‌సమస్య రెండు రకాలు - 

1. హైపో థైరాయిడ్‌. 2. ‌హైపర్‌ ‌థైరాయిడ్‌.

హైపో థైరాయిడ్‌ :

థైరాయిడ్‌ ‌హార్మోన్ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్‌ ‌వస్తుంది. ఇది T3 (Tridothyronine), T4 (Thyroxine)ను థైరాయిడ్‌ ‌గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన  సమస్య వస్తుంది.

‘‌భారతమాత సేవలో సోదరి నివేదిత’

మనదేశం బ్రిటిష్వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ ‌నోబుల్ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

ఆం‌ధప్రదేశ్‌: ‌మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం

మతం మారినప్పటికీ షెడ్యూల్డ్కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధప్రదేశ్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రెటరీ (సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌విభాగం)ని కోరింది. గతంలో లీగల్‌ ‌రైట్స్ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.