ఆం‌ధప్రదేశ్‌: ‌మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం

మతం మారినప్పటికీ షెడ్యూల్డ్కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధప్రదేశ్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రెటరీ (సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌విభాగం)ని కోరింది. గతంలో లీగల్‌ ‌రైట్స్ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై లీగల్‌ ‌రైట్స్ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌సంస్థ ప్రత్యేక దృష్టి నిలిపింది. షెడ్యూల్డ్కులాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మతమార్పిళ్లపై ఎల్‌.ఆర్‌. ‌పి.ఎఫ్‌ ‌పరిశోధనాత్మక నివేదికలను గతంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రాష్ట్రపతి కార్యాల యానికి కూడా పంపింది. దీనిపై ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కార్యాలయం నుండి సూచనలు అందిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు రావడం విశేషం. పైగా తీసుకున్న చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

నివేదిక సారాంశం:

ఏపీలోని ఉధృతంగా సాగుతున్న మత మార్పిళ్లపై లీగల్‌ ‌రైట్స్ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌ప్రత్యేక దృష్టి నిలిపింది. దశాబ్ద కాలంగా ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో చట్టాలు స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో నివేదిక స్పష్టం చేస్తోంది.

నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు :

రోజురోజుకూ అధికమవుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. వీటి కారణంగా కుటుం బాలు విచ్ఛిన్నానికి గురవుతున్నాయి, సామాజిక జీవనానికి ఆటంకం కలుగుతోంది, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అంతేకాదు.. జాతి భద్రతకు సైతం ఇది పెనుప్రమాదంగా పరిణమించింది.

తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కొందరు పాస్టర్లు చేస్తున్న ప్రసంగాలు మతం మారుతున్న వారి మెదళ్లలో దేశవ్యతిరేక బీజాలు నాటుతు న్నాయి.. మరికొందరిలో సాటి మతాల పట్ల ద్వేషభావం కలిగిస్తున్నాయి. దేశభద్రతకు మాత్రమే కాదు. సామాజిక భద్రతకు కూడా ఇది ముప్పే.

మతమార్పిడి చేస్తున్న వారి మాయలో పడ్డ అమాయకులు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యా లకు హాజరుఅవ్వడం మానేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిచ్చుకు కూడా ఇవి కారణం అవుతున్నాయి.

‘‘ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?’’ (What happened to Christians of AP) అంటూ ఢిల్లీకి చెందిన సెంటర్‌ ‌ఫర్‌ ‌పాలసీ స్టడీస్‌ ‌సంస్థ తయారుచేసిన నివేదిక ఇక్కడ గమనించాలి. ఎస్సీ రిజర్వేషన్లు ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయి అనే విషయాన్ని నివేదిక బయటపెట్టింది.

 విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో విషయాన్ని తెలియజేయ కుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు, తమకు విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్ధమవుతుంది.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతిగా తేలుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని వ్యవహారంపై సమగ్ర కసరత్తు చేసి, అక్రమ మత మార్పిళ్లు, రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కోసం తగిన చర్యలు తీసుకోవాలి.