ప్రముఖుల మాట

 

దేశ ప్రజలంతా క్రమశిక్షణతో, సమిష్టిగా కరోనా మహమ్మారిని అంతం చేయాలి. మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీసమైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. కలసి పోరాడితే విజయం మనదే.

- రామ్‌ ‌నాధ్‌ ‌కోవింద్‌, ‌రాష్ట్రపతి

 

కరోనా సంక్షోభ కాలంలో ప్రపంచమంతా భారతీయ జీవన విధానానికి దగ్గరైంది. సేంద్రీయ ఎరువుల వాడకంతో సహా ఇతర పర్యావరణ అనుకూలమైన పద్దతుల వైపు మొగ్గు చూపుతోంది.

- డా. మోహన్‌ ‌భాగవత్‌, ఆర్ఎస్ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్

 ‌ 

సరిహద్దుల్లో సైనికులకు తుపాకి ఎలాగో రైతుకు నాగలి, ట్రాక్టర్అలాగ. వాటిని కాల్చడం రైతుని అవమానించడమే. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు లేదని హామీ ఇస్తున్నాము.

- రాజ్‌ ‌నాధ్‌ ‌సింగ్‌, ‌రక్షణ మంత్రి