సంతోషంగా జరుపుకొనే పండగ విజయ దశమి

 

విజయదశమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అంటారు. నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి, చివరి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.

విజయదశమి నాడు చరిత్ర ప్రకారము రాముడు రావణడిపై విజయం సాధించిన సందర్భమే కాకుండా, పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక జమ్మిచెట్టుపై నుండి తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. సందర్భంగా విజయదశమి నాడురావణ దహనముజమ్మిచెట్టు పూజనిర్వహించటం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గ మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి, అతనిని వధించి జయం పొందిన సందర్భంగా కూడా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా జరుపుకొనే పండగ విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతంలో విశేషంగా ఉంటుంది.

హిందూ రాష్ట్ర నవోదయానికి నాందీ వాచకులు  డాక్టర్‌ ‌కేశవరావు బలిరాం హెడ్గేవార్‌ ‘‘‌రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్’’‌ను విజయదశమి సర్వదినము నాడే ప్రారంభించారు.