థైరాయిడ్‌ ‌సమస్య


  థైరాయిడ్‌ ‌సమస్య రెండు రకాలు - 

1. హైపో థైరాయిడ్‌. 2. ‌హైపర్‌ ‌థైరాయిడ్‌.

హైపో థైరాయిడ్‌ :

థైరాయిడ్‌ ‌హార్మోన్ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్‌ ‌వస్తుంది. ఇది T3 (Tridothyronine), T4 (Thyroxine)ను థైరాయిడ్‌ ‌గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన  సమస్య వస్తుంది.

లక్షణాలు :

చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుగా, గుండ్రంగా అవుతుంది. త్వరగా అలిసిపోవడం, బలహీనంగా ఉండి చలికి తట్టుకోలేరు.

చెమట తక్కువుగా వస్తుంది. జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. మానసికపరమైన ఆందోళన ఎక్కువుగా ఉంటుంది.

గుండె పెరుగుతుంది. గొంతులో మార్పు వస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది. మాటల స్పష్టత తగ్గుతుంది. కండరాల శక్తి క్షీణిస్తుంది. మలబద్దకం, పొట్ట ఉబ్బుగా ఉండటం. రక్తహీనత. దేనిమీద ఆసక్తి లేకపోవటం. కోపం, చిరాకు, విసుగు ఎక్కువుగా ఉంటాయి. జుట్టు రంగు తగ్గుతుంది. 

సమస్య ఎక్కువుగా స్త్రీలలో కనిపిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి వస్తుంది. మలబద్దకం ఎక్కువుగా ఉండును. ఋతువు సరైన సమయానికి రాదు. ఋతు సమయంలో కడుపులో నొప్పి ఉంటుంది. 

కండరాలు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. భుజాలు, చేతులు, కాళ్లు నొప్పిగా ఉంటాయి. చేతి, కాలి వేళ్ళ గోళ్లు పగుళ్లు రావచ్చును.

జాగ్రత్తలు :

థైరాయిడ్‌ ‌బాగా పనిచేయాలి అంటే ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవాలి. పసుపుపచ్చ రంగులో ఉండే పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్, ‌పచ్చికొబ్బరి తినవలెను. గుడ్డు, ఉల్లిపాయ కూడా మంచివి. హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజి, సోయాబీన్స్, ‌వేరుశనగ, మొక్కజొన్న, బఠాణి, ముల్లంగి మెదలైనవి వాడకూడదు.

 - ఉషా లావణ్య పప్పు