వ్యవసాయ సంస్కరణలు.... రైతుల జీవితాల్లో వెలుగు రేఖలు...!

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ కేంద్రం ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛ రైతులకు లభించింది. దీంతో పాటు అనేక రకాలుగా రైతులకు సంస్కరణలు ప్రయోజనం కలిగిస్తున్నాయి.

అనేక దశాబ్దాల క్రితం దేశంలో వ్యవసాయిక దిగుబడులు తక్కువగా ఉండేవి. సమయంలో వివిధ ప్రాంతాల్లో ఆహార కొరత తలెత్తకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆంక్షలు విధించారు. ప్రధానమైన ఆహార పంటలు, కొన్ని రకాల వాణిజ్య పంటల్ని.. పండించిన ప్రాంతాల్లోనే రైతులు అమ్ముకోవాలి తప్పితే, ఇతర ప్రాంతాలకు ఆయా ఉత్పత్తులను తీసుకెళ్లడానికి వీలు లేదు. స్థానిక మార్కెట్‌ ‌లలోని దళారులు ఎంత రేటు కడితే అదే రేటుకి అమ్మాలి తప్పితే, మరో చోటకు తీసుకెళ్ళి అమ్ముకొనేందుకు వీలు లేదు. ఇందులో ప్రధానంగా మార్కెటింగ్‌ ‌శాఖ, పౌరసరఫరాల శాఖ, స్థానిక పన్నుల శాఖ లు రైతుని వేరే చోటకు పోనీయకుండా అడ్డుకొంటాయి. అంటే ప్రభుత్వమే అన్ని వైపుల నుంచి బంధించి, దళారీల దగ్గర రైతుల్ని నిలిపి వేసిన పరిస్థితి. ఒక వైపు రైతు కష్టించి పంటలు పండిస్తుంటే, పంటల్ని అమ్ముకొని కష్టార్జితం తీసుకొనే పరిస్థితి లేదు. రైతులు పంటలు పండించి, పక్క జిల్లాకు పక్క రాష్ట్రానికి తరలించుకొని అక్కడ మంచి రేటు ఉంటే అక్కడకు పోయి అమ్ముకొనే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలోనే టమాటాకు కిలోకి 10 పైసలు, 5 పైసలు చెల్లించిన రోజులు ఉన్నాయి. అసలు రేటు లేక టమాటాలు మార్కెట్‌ ‌లో రోడ్డు మీద వేసేసి రైతులు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిన రోజులు చూశాం.

 ఇటువంటి సంకెళ్లను కొత్త సంస్కరణలు తెంచి వేస్తున్నాయి. అంటే రైతు పంటను పండించాక, దేశంలోని ప్రాంతానికి అయినా తీసుకొని వెళ్లి అమ్ముకోవచ్చు. ఎక్కువ ధర లభించే చోటకు ఉత్పత్తుల్ని తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. దేశమంతా వ్యవసాయిక దిగుబడులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆహారపు కొరత తలెత్తే పరిస్థితి కూడా పెద్దగా కనిపించటం లేదు. దీంతో రైతులకు ఉండే ఆంక్షలు కూడా తొలగిపోతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి అనంతపురం చుట్ట్నుపక్కలరైతులకోసం కిసాన్‌ ‌రైలు పేరుతో రైలు ఏర్పాటు చేసింది. రాయలసీమ రైతులు మామిడి, ఇతర పండ్లను పండించి రైలులో వేసుకొని రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకొని మంచి ధరలను సొంతం చేసుకోగలుగుతారు.

 అంతే కాదు, రైతులు తాము పండించుకొన్న పంటల్ని నచ్చిన చోట అమ్ముకోవచ్చు. అప్పటిదాకా నిల్వ చేసుకోవచ్చు. వాస్తవానికి ఆంక్షలు తొలగించాలని అన్ని రకాల రైతు సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ ‌చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, వెసులు బాటు కల్పించగానే కొన్ని రైతు సంఘాలు వక్ర భాష్యం చెబుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు అనుబంధ సంఘాలుగా తిష్టవేసుకొన్న రైతు సంఘాలు కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. సంఘాలు చేస్తున్న ఆరోపణలను కూడా గమనిద్దాం.

కనీస మద్దతు ధర నాశనం అయిపోతోందని వాదన చేస్తున్నారు. కనీస మద్దతు ధర అనేదానికి మొదట నుంచి చట్టబద్దమైన వ్యవస్థ లేదు. కానీ ప్రస్తుత వ్యవస్థ అదే మాదిరిగా కొనసాగుతుంది. ఇక ముందు కూడా రైతులు నేరుగా పెద్ద ఆహార సంస్థలకు ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. విషయంలో రైతులకు రక్షణ కల్పిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వ హయంలో వరికి 2.4 రెట్లు, గోధుమలకు 1.77 రెట్లు, పప్పు ధాన్యాలకు 75 రెట్లు కనీస మద్దతు ధర పెరిగిన మాట గుర్తించుకోవలసిన అవసరం ఉంది.

కొత్త చట్టాలతో రాష్ట్రాలలోని మార్కెటింగ్‌ ‌వ్యవస్థను నాశనం చేస్తున్నారనే వాదన వినిపిస్తు న్నారు. ఇదికూడా తప్పు. రాష్ట్ర ప్రభుత్వాల మార్కెటింగ్‌ ‌చట్టాలను రద్దుచేయటం లేదు. మార్కెటింగ్‌ ‌వ్యవస్థలలోని లోపాలను సరిదిద్దు తున్నారు. మార్కెట్లను ప్రజాస్వామ్యబద్దం చేస్తున్నారు. అదనంగా రైతులు మెరుగైన ధరలకు అమ్ముకోవటానికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా చేస్తోంది.

రైతులు తమ భూములను ప్రైవేటు వ్యవస్థలకు అమ్మ్నుకోవాల్సి వస్తుంది, తనఖా పెట్టాల్సి వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా వాస్తవ దూరం. వాస్తవానికి రైతులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవటం అనేక చోట్ల అమలులో ఉన్నది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌సహా అనేక రాష్ట్రాలు చట్టబద్దం చేసిన వ్యవస్థలు ఇవి. వీటిని దేశమంతటా వ్యవస్థీక్రతం చేస్తున్నారంతే. రైతులకు విత్తనాలు, మార్కెటింగ్ఇన్‌ ‌పుట్స్, ‌సాంకేతిక సహకారం ఇవ్వాల్సిన బాధ్యత కొనుగోలుదారుదే. తర్వాత కాలంలో ధర ఇచ్చి కొనుక్కోవాలి. షరతులన్నీ వ్యవస్థీక్రతం చేసి రైతులకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల భూమి అమ్మకం, కౌలు లేదా తాకట్టు ను నిషేధించటమే కాకుండా రైతు భూమికి రికవరీ నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నారు. నిర్ణీత కాలంలో వివాదాలు పరిష్కరించేందుకు బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.

వ్యవసాయంలో ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థల జోక్యం పెరిగిపోతుంది. ఇది చాలా తప్పుడు వాదన. ప్రపంచ మార్కెట్‌ ‌లో భారత దేశం సరయిన రీతిలో మార్కెటీకరించుకొంటే 7 లక్షల కోట్ల రూపాయిల మేర మార్కెటింగ్అవకాశాలు ఉన్నాయని అంచనా. కానీ అవేమీ పట్టించుకో కుండా మనం పాత పడికట్లు పదాలతో మనల్ని మనం మోసపుచ్చు కొంటున్నాం. ఒక వైపు గోడౌన్లలో పంట దిగుబడులు కుళ్లిపోతుంటాయి, మరో వైపు ఎగుమతులు చేయకుండా ఆంక్షలకు రైతుల దగ్గరకు భారీ అవకాశాలు కల్పించటం, పెద్ద ఎత్తున విస్తరణ అవకాశాలు కల్పించటం చట్టాల ఉద్దేశ్యం. దీని ద్వారా రైతులకు విరివిగా అవకాశాలు పెరుగుతాయి.

ప్రపంచ మొత్తం మీద చూస్తే 12శాతం వ్యవసాయ భూమి భారత దేశంలో ఉన్నది. అనేక పండ్ల తోటల దిగుబడి లో భారత్గ్ర స్థానంలో నిలుస్తుంది.. కానీ ప్రపంచ మార్కెట్లలో మన పండ్ల విక్రయాల మార్కెట్‌ 1 ‌లేదా 2 శాతానికి మించి లేదు. ఇది దారుణమైన పరిస్థితి. పరిస్థితి తొలగిపోయి,, రైతుల ఆదాయాలు గణనీయంగా పెరగబోతున్నాయి.. అందుచేత వ్యవసాయ సంస్కరణలతో అనేక మార్గాలలో రైతులకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. రైతులకు అనేక రీతులుగా ప్రయోజనాలు కలిగి, వారి జీవితాల్లో వెలుగు రేఖలు అలముకొంటున్నాయి.

- రమ విశ్వనాథన్